धर्माधारा धनाध्यक्षा धनधान्यविवर्धिनी ।
विप्रप्रिया विप्ररूपा विश्वभ्रमणकारिणी॥

ధర్మాధారా

సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకున్న ట్రస్ట్

Dharmādhārā — Rooted in Sanātana Dharma

ధర్మే సర్వం ప్రతిష్ఠితం — సమస్తమూ ధర్మంలోనే నిలిచి ఉంది.
ఆ ధర్మానికి ఆధారం ధర్మాధారా ట్రస్ట్.

"Dharme sarvam pratiṣṭhitam" — Everything is established in Dharma.
Dharmādhārā exists to stand as its living support.

వేద నిధికి సహాయ పడగలరు Support the Veda Fund మా గురించి Learn More

ధర్మాధారా అంటే ఏమిటి?

What is Dharmādhārā?

ధర్మాధారా అనేది దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠానికి చెందిన ఉభయ జగద్గురువుల మరియు శ్రీ శ్రీ అమృతానంద సరస్వతీ స్వామివారి ఆశీర్వాదాలతో స్థాపించబడిన, చట్టబద్ధంగా నమోదు చేయబడిన లాభాపేక్ష లేని ట్రస్ట్.

సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకొని ధర్మాన్ని ఆచరింపు జేయు సంస్థ — తరతరాలకు కొనసాగించే సంస్థ. చిలుకూరులో వేద పాఠశాల మరియు గోశాల, దేశవ్యాప్తంగా యజ్ఞ నిర్వాహణ, మరియు నెల్లూరులో ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

"యస్మిన్ దేశే య ఆచారః పారంపర్యక్రమాగతః ।
ఆమ్నాయైరవిరుద్ధశ్చ స ధర్మః పరికీర్తితః॥"

Dharmādhārā is a legally registered not-for-profit Trust, founded with the blessings of the Ubhaya Jagadgurus of Dakṣiṇāmnāya Śṛṅgerī Śāradā Pīṭham and Śrī Śrī Amṛtānanda Sarasvatī Swāmī.

Rooted in Sanātana Dharma, Dharmādhārā operates a Veda Pāṭhaśālā and Gauśālā at Chilkur near Hyderabad, conducts Yajña Nirvāhaṇa across the country, and undertakes heritage restoration in Nellore — each a pillar of the Dharmic civilisational continuum.

"Yasmin deśe ya ācāraḥ pāramparya-kramāgataḥ।
Āmnāyair aviruddhaś ca sa dharmaḥ parikīrtitaḥ॥"

Dharma is that which has come down through tradition and is not opposed to the Vedas. — Saṃvarta Smṛti

సమగ్ర విద్య

Samagra Vidyā

గురుకుల పాఠశాల — పూర్వ సంస్కారములు (స్మార్తం) మరియు షోడశ కర్మ అంతం (7 సంవత్సరల విద్య); కృష్ణ యజుర్వేదం (క్రమ భాగం 12 సంవత్సరాలు, ఘనం భాగం 14 సంవత్సరాలు).

Gurukula Pāṭhaśālā — Pūrva Saṃskāras (Smārta rites) and completion of the Ṣoḍaśa Karmas (7 years); Kṛṣṇa Yajurveda — 12 years for the Krama recitation method, 14 years for the Ghana.

యజ్ఞ నిర్వాహణ

Yagna Nirvāhaṇa

సోమ యాగాలు, పంచ యజ్ఞాలు — లోక క్షేమార్థం నిస్వార్థ సమర్పణ.

Soma Yāgas and Pañca Yajñas — selfless offerings for universal welfare (loka-kṣema).

జీర్ణోద్ధారణ

Jirnoddhāraṇa

ఆలయాల పునరుద్ధరణ — నెల్లూరు చిత్రకూటం పునర్జీవనం మరియు సాంస్కృతిక వారసత్వ సంరక్షణ.

Temple heritage restoration — reviving Nellore's Chitrakootam and preserving painted traditions for future generations.

గోశాల

Gauśālā

దేశీయ జాతి గోవుల రక్షణ — పంచ గవ్య సంప్రదాయం, గో సేవ మరియు వైదిక ఆచారాల ఆధారం.

Indigenous desi cow sanctuary — protecting native breeds, sustaining the Pañca-gavya tradition and Vedic ritual foundations.

ధర్మాధారా గురుకుల పాఠశాల

Dharmādhārā Gurukula Pāṭhaśālā

స్వామి అమృతానంద సరస్వతి గారి పాఠ్యక్రమం ఆధారంగా రూపొందించిన 12-సంవత్సరాల సమగ్ర భారతీయ జ్ఞాన వ్యవస్థ. ఉపనయనం అనంతరం 7-8 సంవత్సరాల వయసులో ప్రవేశం; 19-20 సంవత్సరాల వయసులో విద్యా స్నాతక్ పట్టా. లౌకిక, సాంస్కృతిక, వైదిక విద్యలు ఒకే ఛాదస్సు కింద నేర్చుకొనే అవకాశం.

Based on the Pāṭhyakrama of Svāmī Amṛtānanda Sarasvatī, this 12-year integrated curriculum of Indian Knowledge Systems is structured in three developmental phases. Students enter at age 7–8 (post-Upanayana) and complete their Vidyā-Snatak at approximately age 19–20 — the traditional Brahmacharya period. Loukika, Sāṃskṛtika, and Vaidika learning are unified under one roof.

7–8 సంవత్సరాలకు ఉపనయనము అయినవారికి 9–10 సంవత్సరాలలో ప్రవేశ అర్హత కల్పించబడును.

Children who have completed Upanayana at age 7–8 become eligible for admission at age 9–10.

ప్రవేశమునకు అర్హతలు:

Admission prerequisites:

  1. స్పష్టముగా తెలుగు మాట్లాడుట
  2. తెలుగు చూసి చదువుట, వ్రాయుట
  3. వాచక ధోరణి
  4. స్వశరీరమైన పనులు (కాలకృత్యాలు)
  5. అగ్ని కార్యము
  6. త్రికాల సంధ్యా వందనము
  7. బ్రహ్మ యజ్ఞము (ఐచ్ఛికము)
  8. లలిత, విష్ణు సహస్రనామములు వచ్చి ఉండుట
  1. Spoken Telugu with clarity
  2. Reading and writing Telugu
  3. Recitation tone (Vāchaka Dhōraṇi)
  4. Independence in personal care (Kālakṛtyas)
  5. Agni Kārya
  6. Trikāla Sandhyā Vandanam
  7. Brahma Yajña (optional)
  8. Knowledge of Lalitā Sahasranāma and Viṣṇu Sahasranāma

సర్టిఫికేషన్ స్థాయులు

Certification Levels

ప్రథమ — Bāla-Vidvanసం. 1–3
ద్వితీయ — Vidyā-Praveśakaసం. 4–6
తృతీయ — Vidyā-Madhyamaసం. 7–9
చతుర్థ — Vidyā-Snātakసం. 10–12
విశేషత — Śāstra-Prāṅgaṇa+2 సంవత్సరాలు
ఉత్తమ — Dharmādhārā-Prajñanఅత్యున్నత

చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో నిర్మించబడుతోంది ఈ గురుకుల పాఠశాల — "ధర్మసంవర్ధిని వేదవిద్యాలయము" — శ్రీమతి ఎరగుడిపాటి గిరిజాకుమారి మరియు వారి దివంగత భర్త బ్రహ్మశ్రీ వడ్లపట్ల గురునాథ రావు గారి జీవిత కల, ఇప్పుడు వారి కుమారుడు శ్రీ ఓం వడ్లపట్ల ద్వారా సాకారం అవుతున్నది.

Currently being built near Chilkur Balaji — "Dharmasaṃvardhinī Vedavidyālayam" — this Gurukula is the lifelong vision of Smt. Yeragudipati Girijakumari and her late husband Brahmaśrī Vadlapatla Gurunatha Rao, now being realised by their son Sri Om Vadlapatla (Govinda Sharma).

✦ విద్యా నిధికి సహాయం చేయండి ✦ Support the Gurukula

యజ్ఞ సంప్రదాయం

The Yajña Tradition

యజ్ఞం అనగా కేవలం అగ్నికర్మ కాదు — నిస్వార్థ సమర్పణ. దేవతలు, ఋషులు, అతిథులు, సమాజం, జంతువులు — వీరందరికీ అర్పణ చేయడమే పంచ యజ్ఞం.

Yajña is not merely a fire ritual — it is selfless offering (nisvārtha samarpaṇa). The Pañca Mahāyajña — offerings to devas, ṛṣis, pitṛs, guests, and all beings — is the foundation of Dharmic household life.

మా సంస్థచే నిర్వహింపబడిన యజ్ఞ-యాగాది క్రత్వ అనుష్ఠానములు శాస్త్రవిహితముగా — యాగ లక్షణములు, వేదాధ్యాపక-అధ్యయన పరులు, వైదిక మార్గ ప్రవర్తకులు, త్రయంహిక దీక్షా వివాహితులు, త్రయంహిక ఉపనీతులు, భారతీయ జీవన పరులచే నిర్వహించబడును. శ్రుతి-యుక్తమైన యాగములు (స్మార్త యాగములు, ఆగమ యాగములు), శ్రౌత యాగములు ఈ సంస్థ ద్వారా జరుగుతున్నవి.

All yajñas conducted by Dharmādhārā follow the prescriptions of Śāstra — performed with Veda teachers and students (adhyāpaka–adhyayana), married Trayambhika dīkṣitas, Trayambhika initiates, and Brāhmaṇas rooted in the traditional Bhāratīya way of life. The institution conducts Śruti-yukta yāgas — both Smārta and Āgama — as well as Śrauta yāgas.

యజ్ఞ చరిత్ర A Lineage of Offerings

ధర్మాధారా ట్రస్ట్ నిర్వహించిన ప్రధాన యజ్ఞ-యాగములు Major yajñas and yāgas conducted by Dharmādhārā Trust

పూర్వ నేపథ్యంPre-2021 · Foundational Grace
భువనేశ్వరి హోమం · ఆవాహంతి హోమములు
Bhuvaneśvarī Homam · Āvāhanti Homas
శాశ్వత వేద పాఠశాల నిర్మాణ భూ భాగము కొరకు — శ్రీ శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారి (కంచి కామకోటి పీఠం) దివ్యానుగ్రహ ఆశీర్వాద ఆజ్ఞానుసారముగా నిర్వహింపబడినవి.
Performed for the consecration of the land destined for the permanent Veda Pāṭhaśālā — under the direct blessings and ājñā of H.H. Śrī Śrī Vijayendra Sarasvatī Swāmīji (Kāñchi Kāmakoṭi Pīṭham).
2021
ఐకాహిక మహావ్రత అగ్ని-చయనము
Aikāhika Mahāvrata Agni-Cayana
బ్రహ్మశ్రీ వేదమూర్తులు దెందుకూరి వేంకటేశ్వర యాజులు గారిచే క్రియారూపం దాల్చిన మహాయాగము.
Conducted under the ritual direction of Brahmaśrī Vedamūrtuḷu Deṇḍukūri Veṅkateśvara Yājulu garu.
2022
చండీ హోమం
Chaṇḍī Homam
శక్తి స్వరూపిణి దుర్గామాత ప్రీత్యర్థము నిర్వహించబడిన మహా హోమం.
A grand Homam offered to Devi Chaṇḍikā, invoking the protective and nourishing power of the Mother.
2023
ధర్మాధార ట్రస్ట్ స్థాపన
Dharmādhārā Trust — Formal Establishment
సమస్త పరిపూర్ణ నిర్మాణ వ్యవస్థ ఏర్పాటు — ట్రస్ట్ చట్టబద్ధ స్థాపన.
The full organisational and legal structure of the Trust was constituted this year, giving the work a formal civilisational footing.
2024
సమూహ పౌండరీక యాగం
Sāmūhika Pauṇḍarīka Yāga
బ్రహ్మశ్రీ వేదమూర్తులు దెందుకూరి వేంకటేశ్వర యాజులు గారిచే క్రియారూపం దాల్చిన సామూహిక శ్రౌత యాగము.
A community Śrauta yāga conducted under the ritual direction of Brahmaśrī Vedamūrtuḷu Deṇḍukūri Veṅkateśvara Yājulu garu.
2026
మన్యుసూక్త హోమం — హనుమజ్జయంతి
Manyusūkta Homam — Hanumaj-Jayantī
హనుమజ్జయంతి సందర్భముగా ఋగ్వేద మన్యుసూక్త మంత్రాలతో నిర్వహించిన హోమం — ధర్మ రక్షణార్థము.
On the occasion of Hanumaj-Jayantī, a Homam offered with the Ṛgvedic Manyu-sūkta mantras — for the protection of dharma.

"సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ॥"

Bhagavad Gītā 3.10 — "Creating mankind together with sacrifice, Prajāpati said: by this may you prosper."

యజ్ఞానికి సహాయం చేయండి Support the Yajñas

యజ్ఞ నిర్వాహణ నిధి

Yajña Support Fund

ప్రతి యజ్ఞానికి నిధి సహాయం అవసరం

Each Soma Yāga requires sponsorship for materials, Vaidika honoraria, and ritual infrastructure

ప్రస్తుత నిధిCurrent Fund
యజ్ఞ సామగ్రిRitual materialsసంప్రదించండి
వైదికుల సహాయంVaidika honorariaసంప్రదించండి
మౌలిక సదుపాయాలుInfrastructureసంప్రదించండి
✦ సంపూర్ణ నిధి వివరాలు ✦ Full Fundraising Page

80G Tax Exempt · dharmadhara.trust@gmail.com

Chitrakootam

నెల్లూరు తల్పగిరి శ్రీ రంగనాథస్వామి ఆలయం

Sri Talpagiri Ranganathaswamy Temple, Nellore

చిత్రకూటం 1835 సంవత్సరంలో శ్రీ ఎరగుడిపాటి వెంకటాచలం పంతులు గారు నిర్మించారు. ఇది తల్పగిరి రంగనాథస్వామి ఆలయానికి అనుబంధ నిర్మాణం — ఉత్సవ సమయంలో ముఖ్య విగ్రహాలను భద్రపరచేందుకు.

ఈ నిర్మాణంలో విష్ణు దశావతారాల అపురూప గోడ చిత్రాలు, పాలీక్రోమ్ కలప నక్కీసు అట్ట మరియు 7 బాలకృష్ణ తంజావూరు రివర్స్ గ్లాస్ పెయింటింగ్‌లు ఉన్నాయి.

Built in 1835 by Sri Yeragudipati Venkatachalam Panthulu as an ancillary structure to the Ranganathaswamy Temple — deities are brought here for rest during annual processions. The name "Chitra-kootam" means "collection of pictures" in Telugu.

It houses 1835-era Tanjore-school wall paintings of Dasavatara, an intricately carved polychrome wood ceiling with Matsyavatara at centre, and 7 Balakrishna Tanjore reverse glass paintings.

నష్టాల వివరాలు

Damage Assessment (Indus Art Conservation Services, April 2024)

  • గోడ చిత్రాలపై భారీ మసి, ధూళి పేరుకుపోవడం — అసలు రంగులు మాయమవుతున్నాయి
  • Heavy soot and grime obliterating original colours on all four wall painting surfaces
  • పూర్వ జోక్యంలో మొత్తం నేపథ్యంపై తెల్ల ఎనామెల్ పెయింట్ వేశారు
  • Prior intervention covered entire background with white enamel paint, obscuring original work
  • మత్స్యావతార ప్యానెల్ కలప అట్ట నుండి విడిపోయి క్రింద పడి ఉంది
  • Matsyavatara panel detached from polychrome wood ceiling, found lying in premises
  • మూలాల పెరుగుదల, జీవ క్షయం వల్ల పగుళ్ళు మరియు రంగు నష్టం
  • Root growth and biodeterioration (fungi, algae, moss) causing irreversible structural damage
  • 7 తంజావూరు గ్లాస్ పెయింటింగ్‌లకు గోల్డ్ లీఫ్ చీకటి పడింది, ఫ్రేమ్‌లు పాడయ్యాయి
  • 7 Tanjore reverse glass paintings with darkened gold leaf, flaking paint, worn frames
చిత్రకూటానికి సహాయం చేయండి Support Chitrakootam

పునరుద్ధరణ నిధి

Restoration Fund

Indus Art Conservation Services · FY 2024–25

₹98,80,500
గోడ చిత్రాలు (4 వైపులు, 8.96×1.91m)Wall paintings (4 sides)₹27,12,500
కలప అట్ట (2.7×2.7m)Polychrome wood ceilingఅంచనాలో
తంజావూరు గ్లాస్ పెయింటింగ్‌లు (7)Tanjore glass paintings (7)₹1,68,000
శిథిల పైకప్పు, గోడల పునర్నిర్మాణంReconstruction of dilapidated roof & walls₹70,00,000
మొత్తం Total ₹98,80,500
⚠ అంచనా 2024-25 ఆర్థిక సంవత్సరానికి. GST (18%) వర్తించవచ్చు. నిర్మాణ పని వేరే. ⚠ Estimate for FY 2024-25. GST (18%) applicable. Structural conservation by client.
సేకరించిన నిధిFunds Raised 22%
✦ సంపూర్ణ నిధి పేజీ చూడండి ✦ View Full Fundraising Page

Timeline: 4–5 months · AIC & ICOM standards

కామధేను గోశాల

Kāmadhenu Gauśālā

గోమాత అనేది కేవలం జంతువు కాదు — ఆమె యజ్ఞానికి ఆధారం, పంచ గవ్య సంప్రదాయానికి మూలం, మరియు వైదిక జీవన విధానానికి కేంద్రం. ధర్మాధారా గురుకుల ఆవరణలో స్వదేశీయ జాతి గోవులను పోషిస్తున్నాం.

ఒంగోలు, గిర్, సాహివాల్ వంటి దేశీయ జాతి గోవుల రక్షణ మన బాధ్యత. ఈ గోవులు పంచ గవ్యం (పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ) ద్వారా యజ్ఞాలకు అత్యవసరం.

The Gomātā is not merely an animal — she is the foundation of Yajña, the source of the Pañca-gavya tradition, and the centre of Vedic household life. Dharmādhārā maintains indigenous desi cows at the Gurukula campus.

Native breeds — Ongole, Gir, Sahiwal — are our sacred duty to preserve. These cows provide Pañca-gavya (milk, curd, ghee, urine, dung) essential to all ritual traditions, and their A2 milk sustains the students of the Gurukula.

దేశీ
Desi
స్వదేశీయ జాతి
Native breeds only
A2
పాలు — గురుకుల విద్యార్థులకు
Milk for Gurukula students
5
పంచ గవ్య సంప్రదాయం
Pañca-gavya products
జీవితాంతం రక్షణ
Lifelong sanctuary

గోశాల నిధి

Gauśālā Maintenance Fund

ప్రతి నెల గో సంరక్షణకు మీ సహాయం అవసరం

Monthly cow maintenance requires community support

మేత మరియు ఆహారంFeed & fodderనెలకు
వైద్య సంరక్షణVeterinary careనెలకు
ఆవాసం & మౌలిక సదుపాయాలుShelter & infrastructureఒకసారి
గోశాల విస్తరణExpansionదీర్ఘకాలిక
🐄 ఒక్క గోవు మాసిక సంరక్షణకు సహాయపడండి — గో సేవ మహా పుణ్యం. 🐄 Sponsor a cow's monthly care — Go-sevā is among the highest Dharmic acts.
నెలవారీ నిధి లక్ష్యంMonthly target
✦ గో సేవలో భాగస్వాములు కండి ✦ Participate in Go-Sevā

dharmadhara.trust@gmail.com

దానం కాదు — ధర్మంలో భాగస్వామ్యం

Not Charity — Participation in Dharma

ధర్మాధారానికి సహకరించుట అనేది ధర్మానికి భాగస్వామ్యం. ఒక్క తరం చేసిన సేవ వేయి తరాలకు ఆశీర్వాదం అవుతుంది.

Supporting Dharmādhārā is participation in Dharma — not philanthropy. Service rendered in one generation becomes a blessing for a thousand.

సమగ్ర విద్యా ప్రాజెక్ట్
Samagra Vidyā — Gurukula
సహాయం అవసరం
Support Needed

ఆచార్యుల సహాయం, విద్యార్థి పోషణ, గ్రంథాలు మరియు మౌలిక సదుపాయాలు.

Teacher salaries, student stipends, texts, and campus infrastructure for the 12-year Gurukula.

వివరాలు చూడండి → View campaign →
యజ్ఞ నిర్వాహణ
Yajña Nirvāhaṇa
సహాయం అవసరం
Support Needed

యజ్ఞ సామగ్రి, వైదికుల సహాయం, లోక క్షేమార్థ కర్మలు.

Ritual materials, Vaidika honoraria, and loka-kṣema Soma Yāgas conducted for all beings.

వివరాలు చూడండి → View campaign →
Chitrakootam Restoration
₹98,80,500

1835 నాటి గోడ చిత్రాలు, కలప నక్కీసు అట్ట, 7 తంజావూరు పెయింటింగ్‌లు, మరియు శిథిల పైకప్పు-గోడల పునర్నిర్మాణం.

Restore 1835-era wall paintings, carved polychrome wood ceiling, 7 Tanjore glass paintings, and reconstruct the dilapidated roof & walls.

వివరాలు చూడండి → View campaign →
కామధేను గోశాల
Kāmadhenu Gauśālā
నెలవారీ సహాయం
Monthly Support

దేశీయ జాతి గోవుల సంరక్షణ — మేత, వైద్యం, ఆవాసం.

Native desi cow sanctuary — feed, veterinary care, shelter, and expansion of the Gauśālā.

వివరాలు చూడండి → View campaign →

80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు · విదేశీ విరాళాలు వర్తించే చట్టాల ప్రకారం స్వీకరిస్తాం

Tax-exempt under Section 80G · Overseas donations accepted subject to applicable regulations

ట్రస్టీలు

The Founding Trustees

శ్రీమతి ఎరగుడిపాటి గిరిజాకుమారి

స్థాపక ట్రస్టీ · అధ్యక్షురాలు · మార్గదర్శిని
Founding Trustee · President · Mentor

హైదరాబాద్ జియాగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి పదవీ విరమణ చేసిన ప్రిన్సిపాల్. వందలాది విద్యార్థుల జీవితాలను విద్య ద్వారా మలిచిన గురువులు.

Retired Principal of Government High School, Jiyaguda, Hyderabad — an educator who shaped hundreds of lives. Her maternal family has deep roots near the Talpagiri Ranganathaswamy Temple, Nellore.

భర్త బ్రహ్మశ్రీ వేదమూర్తులు కీర్తి శేషులు వడ్లపట్ల గురునాథతో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో వేద పాఠశాల స్థాపన కలగా పెట్టుకున్నారు — ఇదే "గురునాథ స్వప్న".

Together with her late husband Brahmaśrī Vadlapatla Gurunatha Rao, she held the dream of establishing a Veda Pāṭhaśālā near Chilkur Balaji — the vision they called "Gurunatha Swapna."

శ్రీ ఓం వడ్లపట్ల (గోవింద శర్మ)

స్థాపక ట్రస్టీ · ఖజానాదారు · కర్త
Founding Trustee · Treasurer · Kartā

అమెరికాలో వ్యాపార జీవితం అనంతరం భార్య డా. సౌమ్య జోస్యుల (వడ్లపట్ల)తో కలిసి భారతదేశానికి తిరిగివచ్చారు. శాస్త్రీయ కర్మకాండ ఆచరణలో జీవితం మలుచుకున్నారు.

After a substantive career in the US, returned to India with wife Dr. Sowmya Josyula to reclaim Vedic inheritance. Now works full-time to realise Gurunatha Swapna as a complete Śāstra Gurukula.

ద్వారకా మరియు జ్యోతిర్మఠ జగద్గురువుల ఆశీర్వాదాలతో శ్రీ శ్రీ అమృతానంద సరస్వతీ స్వామివారి మార్గదర్శనం పొందారు. పూర్ణ శ్రీ విద్య మరియు శాంభవీ విద్య అనుగ్రహం పొందారు.

Blessed by the Jagadgurus of Dwārakā and Jyotirmaṭh, guided by Śrī Śrī Amṛtānanda Sarasvatī. Holds Pūrṇa Śrī Vidyā and Śāmbhavī Vidyā initiations.

సాధారణ ప్రశ్నలు

Frequently Asked Questions

ధర్మాధారా చట్టబద్ధంగా నమోదైన సంస్థనా?
Is Dharmādhārā legally registered?
అవును. భారత చట్టాల ప్రకారం చట్టబద్ధంగా నమోదు చేయబడిన లాభాపేక్షలేని ట్రస్ట్. 80G కంప్లయంట్.
Yes. A legally registered not-for-profit Trust operating under Indian law. 80G tax-exempt.
విరాళాలు వ్యక్తిగత లాభాలకు వినియోగిస్తారా?
Are donations used for personal benefit?
కాదు. ట్రస్టీలు సేవాభావంతో బాధ్యత నిర్వహిస్తారు. విరాళాలు పూర్తిగా ధర్మ కార్యక్రమాలకే.
No. Trustees serve voluntarily. All donations are used solely for Dharmādhārā's charitable objectives.
ప్రత్యేక ప్రాజెక్ట్‌కు మాత్రమే విరాళం ఇవ్వవచ్చా?
Can I donate to a specific project?
అవును. విద్య, యజ్ఞం, చిత్రకూటం, గోశాల — ఏ ప్రాజెక్టుకైనా ప్రత్యేకంగా సహకరించవచ్చు.
Yes. You may designate to Vidyā, Yajña, Chitrakootam, or Gauśālā separately.
విదేశాల్లో నివసించే వారు విరాళాలు ఇవ్వవచ్చా?
Can overseas donors contribute?
అవును. వర్తించే చట్టాలు మరియు నిబంధనల ప్రకారం విదేశీ విరాళాలు స్వీకరించబడతాయి.
Yes, subject to applicable regulations. Please contact us for details.
నా విరాళానికి పన్ను మినహాయింపు ఉంటుందా?
Are donations tax-exempt?
అవును. 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
Yes. Tax-exempt under Section 80G of the Income Tax Act.
గోశాలలో ఏ జాతి గోవులు ఉన్నాయి?
Which breeds are in the Gauśālā?
ఒంగోలు, గిర్, సాహివాల్ వంటి స్వదేశీయ దేశీ జాతి గోవులు మాత్రమే. హైబ్రిడ్ జాతులు కాదు.
Only indigenous desi breeds — Ongole, Gir, Sahiwal. No hybrid or Jersey breeds.
ధర్మాధారా కార్యక్రమాలలో పాల్గొనవచ్చా?
Can I participate in activities?
అవును. కార్యక్రమ స్వభావాన్ని బట్టి పాల్గొనుటకు అవకాశం ఉంటుంది.
Yes. Dharmādhārā welcomes participation subject to the nature of each activity.
ఇతర సంస్థలకంటే ఎలా భిన్నం?
How is Dharmādhārā different?
ధర్మాధారా కార్యక్రమాలకన్నా ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. పరంపర కొనసాగింపు కోసం పనిచేస్తుంది.
Dharmādhārā prioritises lived practice over events — civilisational continuity, not publicity.